అల్లు అర్జున్ అల్లు స్టూడియోస్‌!

-

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌కి ఇండ‌స్ట్రీలో స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా మంచి పేరున్న విష‌యం తెలిసిందే. అయితే మిగ‌తా వారిలా అల్లు వారికి ప్ర‌త్యేకంగా ఫిల్మ్ స్టూడియో అంటూ ఏమీ లేదు. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `అల్లు స్టూయోస్‌` పేరుతో ఓ ఫిల్మ్ స్టూడియోని ప్రారంభించారు. ఈ విష‌యాన్ని తాత‌, ప్ర‌ముఖ హాస్య న‌టులు అల్లు రామ‌లింగ‌య్య 99వ జ‌యంతి సంద‌ర్భంగా బ‌య‌ట‌పెట్టారు.

అక్కినేని ఫ్యామిలీకి అన్న‌పూర్ణ స్టూయోస్ వుంది. ద‌గ్గుబాటి ఫ్యామిలీకి రామానాయుడు స్టూడియోస్ వుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ ఫ్యామిలీకి ప‌ద్మాల‌యా స్టూడియో వుంది. అదే త‌ర‌హాలో అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించ‌బోతున్నారు. భారీ చిత్రాల నిర్మాణానికి అనుకూలంగా ఈ స్టూడియోని నిర్మించ‌బోతున్నార‌ట‌. హాస్య న‌టులు అల్లు రామ‌లింగ‌య్య 99వ జ‌యంతి సంద‌ర్భంగా స‌మావేశ‌మై ఆయ‌ను నివాళులు అర్పించిన అల్లు ఫ్యామిలీ మెంబ‌ర్స్ అల్లు అర‌వింద్‌, అల్లు వెంక‌ట్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్ త‌మ కొత్త స్టూడియోని అనౌన్స్ చేశారు. చిరంజీవి వైజాగ్‌లో స్టూడియో నిర్మాణానికి రెడీ అవుతుండ‌గా సిటీ ఆట్‌స్క‌ర్ట్స్‌లో వి.వి.వినాయ‌క్ స్టూడియోని నిర్మించ‌బోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news