29 ట‌న్నుల క్యారెట్ల‌ను వీధుల్లో పార‌బోశారు.. ఎందుకంటే..?

-

సాధార‌ణంగా అనేక దేశాల్లో రైతులు తాము పండించే పంట‌లకు స‌రైన ధ‌ర ల‌భించ‌క‌పోతే త‌మ పంట‌ల‌ను ర‌హ‌దారుల‌పై పార‌బోసి నిర‌స‌న తెలుపుతుంటారు. మ‌న దేశంలోఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా లండ‌న్‌లోనూ ఈ త‌ర‌హా ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. కానీ అది రైతుల నిర‌స‌న కాదు. ఆర్ట్ ఎగ్జిబిష‌న్‌.

29 tonnes of carrots dumped in streets

లండ‌న్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ లండ‌న్‌లో ఉన్న గోల్డ్ స్మిత్స్ ఆర్ట్ కాలేజ్‌లో ఎంఎఫ్ఏ చ‌దువుతున్న రాఫెల్ పెరెజ్ ఇవాన్స్ అనే వ్య‌క్తి త‌న ఆర్ట్ ఎగ్జిబిష‌న్ కోసం ఏకంగా 29 ట‌న్నుల క్యారెట్ల‌ను తెప్పించి వ‌ర్సిటీ వీధుల్లో వాటిని పార‌బోయించాడు. వాటితో అత‌ను గ్రౌండింగ్ అనే ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేయ‌నున్నాడు. త‌రువాత వాటిని స‌మీపంలోని ప‌శువుల ఫాంల‌కు విరాళంగా అందించ‌నున్నాడు. అందుక‌నే అత‌ను అంత భారీ మొత్తంలో క్యారెట్ల‌ను తెప్పించి యూనివ‌ర్సిటీ వీధుల్లో వాటిని పార‌బోయించాడు.

కాగా ప్ర‌స్తుతం ఆ క్యారెట్ల‌కు చెందిన వీడియోలు, ఫొటోలు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. అక్క‌డి విద్యార్థులు కుప్ప‌లుగా ఉన్న ఆ క్యారెట్ల‌పై ప‌డుకుని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అనంత‌రం వాటిని త‌మ సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news