సైరా, పింగళి గెటప్స్​లో అల్లు అర్జున్ పిల్లలు

-

74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. సమరయోధులను స్మరించుకుంటున్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహా.. తన పిల్లలు అయాన్, అర్హలకు స్వాతంత్ర యోధుల వేషధారణలు వేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్​గా మారాయి. ఇందులో అయాన్.. సైరా నరసింహారెడ్డి లుక్​లో, అర్హ.. జాతీయ జెండా ఆవిష్కకర్త పింగళి వెంకయ్యగా ఆకట్టుకుంటున్నారు.

Aa

మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారి ఆదర్శాలను గుర్తుచేసుకోవాలని మెగాస్టార్​ చిరంజీవి ట్వీట్​ చేశారు. స్వరాజ్యంతో మనందరికి కొత్త జీవితం ప్రారంభమైన రోజు ఇదని పేర్కొన్నారు మహేశ్​బాబు​. కరోనా పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలుస్తున్న యోధులకు సెల్యూట్ చేస్తూ బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ ట్వీట్​ చేశారు.  వీరితోపాటే శుభాకాంక్షలు చెప్పిన వారిలో దర్శకులు శ్రీను వైట్ల, గుణశేఖర్​, హీరో రామ్​చరణ్​, జూ.ఎన్టీఆర్​, అల్లు అర్జున్​, శర్వానంద్​ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version