భారత్ కు నేపాల్ ప్రధాని కీలక సందేశం

-

భారత్​- అమెరికా సన్నిహిత మిత్ర దేశాలని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను పంచుకుంటాయని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఉద్ఘాటించారు. 74వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు పాంపియో.

అమెరికా ప్రభుత్వం, ప్రజల తరఫున భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత్, అమెరికా మధ్య స్నేహబంధం చాలా దృఢమైనది. ప్రజాస్వామ్య దేశాలుగా ఇద్దరి మంచి అవగాహన ఉంది. క్రమంగా ఈ బంధం ప్రపంచ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగింది. 21 శతాబ్దంలో ప్రపంచ భద్రత, శ్రేయస్సులో ఇద్దరి సహకారం కీలకంగా మారింది అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు.
పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు భారత ప్రజలకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజల అభివృద్ధి, శ్రేయస్సును కాంక్షిస్తున్నట్లు చెప్పారు.రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఓలి సందేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధాని నరేంద్రమోదీకి, భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు. భారత్, ఆస్ట్రేలియా మధ్య లోతైన స్నేహం, భరోసా, గౌరవం విలువలపై భాగస్వామ్యం స్థాపితమైంది.” అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version