అల్లు అర్జున్ కొత్త సినిమాకు కొత్త లుక్‌.. ఎలా ఉన్నాడో చూడండి..!!

-

ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయి అల్లు అర్జున్ లేకుండానే మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇక త్వ‌ర‌లో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో బన్నీ కూడా పాల్గొననున్నాడు. ఇందులో తమిళ నటుడు విజయ సేతుపతి విలన్ గా నటించనున్నాడని సమాచారం. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా న‌టించ‌గా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక అల.. వైకుంఠపురములో సినిమా ఘనవిజయం సాధించిన జోష్‌లో ఉన్న అల్లు అర్జున్‌ కొన్ని రోజులుగా సుకుమార్ సినిమా కోసం కొత్త లుక్‌లో కనపడుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన కొత్త గెటప్‌ కోసం ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే టాక్ వచ్చింది. ఈ సినిమాలో ఆయన లుక్‌తో పాటు మాట్లాడే భాష యాస కూడా కొత్తగా ఉంటుందట. తాజాగా, స్టైలిష్ స్టార్‌ విమానాశ్రయంలో కనపడ్డారు. మంకీ క్యాప్‌, గడ్డంతో ఆయన కనపడిన లుక్‌ అదుర్స్ అనిపిస్తోంది. ఆయన ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొత్త సినిమాలో కొత్త లుక్‌ కోసం చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఇలా దర్శనమిస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news