పరుగుల వరద పారిస్తున్న జూనియర్‌ ద్రావిడ్‌

-

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రావిడ్ తండ్రిలాగే మైదానాల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఎక్కడ ఏ టోర్నిలో ఆడినాఆ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. తండ్రి రాహుల్ ద్రావిడ్ శిక్షణలో రాటుదేలిన సమిత్‌.. దేశవాళీ టోర్నీల్లో వీరబాదుడు బాదుతున్నాడు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.

ఇటీవల ముంబైలో జరిగిన అండర్-14 బీటీఆర్ షీల్డ్ టోర్నీలో మాల్యా అదితి ఇంటర్నేషనల్ టీమ్‌ తరఫున ఆడిన సమిత్‌.. క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో విద్యాషిల్ప్‌ అకాడమీ జట్టుపై విశ్వరూపం చూపించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. బ్యాటింగ్‌లో 131 బంతుల్లో 24 బౌండరీలతో 166 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోననూ కేవలం 35 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. సమిత్‌ అద్భుత ప్రదర్శనతో మాల్యా జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది.

ఇదే టోర్నీలో ఈ నెల 15న శ్రీకుమరన్‌ చిల్డ్రన్స్‌ అకాడమీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో.. 146 బంతుల్లో 33 బౌండరీలతో డబుల్‌ సెంచరీ నమోదుచేశాడు. గత డిసెంబర్‌లో అండర్‌-14 జోనల్‌ టోర్నీలో వైస్‌ ప్రెసిడెంట్స్‌-XI తరఫున ఆడిన సమిత్‌.. ధార్వాడ్‌ జోన్‌ టీమ్‌పై 256 బంతుల్లో 22 బౌండరీలతో 201 పరుగులు చేశాడు. రెండు నెలల వ్యవధిలోనే రెండు డబుల్‌ సెంచరీలు చేయడమేగాక, ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరస్తున్న సమిత్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news