సినిమాలు విడుద‌ల కాకుండానే రికార్డులు.. టాలీవుడ్ లెక్క‌లు మారిన‌య్‌

సినీ ఇండ‌స్ట్రీలో రికార్డులంటే ఒక‌ప్పుడు సినిమా విడ‌ద‌ల‌య్యాక ఎంత క‌లెక్ష‌న్లు సాధించింది.. ఎంత పెద్ద విజ‌యం న‌మోదు చేసింది.. ఎన్ని రోజుల‌కు ఎన్ని కోట్ల మార్కును దాటింది.. థియేట‌ర్ల‌లో ఎన్ని రోజులు ఆడింది.. ఇలా ఉండేవి లెక్క‌లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అస‌లు సినిమా విడుద‌ల కాక‌ముందే రికార్డుల లెక్క‌లు మారుమోగిపోతున్నాయి. కేవ‌లం టీజ‌ర్‌, సాంగ్‌, ట్రైల‌ర్ల‌కు వ‌చ్చిన వ్యూస్‌, లైకులు, కామెంట్ల‌తోనే రికార్డుల లెక్క‌లు త‌యార‌వుతున్నాయి.


ఇక టాలీవుడ్ లో ఉన్న పెద్ద హీరోల సినిమాల నుంచి ఏ సాంగ్, టీజ‌ర్‌, ట్రైల‌ర్ వ‌చ్చినా.. యూ ట్యూబ్ లెక్క‌లు మారిపోతున్నాయి. ఇక బ‌న్నీ, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్‌, ఎన్టీఆర్ మ‌ధ్య ఎప్ప‌టి నుంచో ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఒక హీరో ఒక రికార్డు క్రియేట్ చేస్తే.. దాన్ని మించిన రికార్డు క్రియేట్ చేయాల‌ని ఇత‌ర హీరోలు ప్లాన్ వేసుకుంటున్నారు. ఇది మ‌రోసారి రుజువైంది. మొన్న వ‌చ్చిన ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చ‌ర‌ణ్ టీజ‌ర్ ఒక రికార్డు అనుకునే లోపే.. భీమ్ టీజ‌ర్ దాన్ని దాటేసింది. ఇంత‌లోపే బాల‌య్య మ‌ధ్య‌లోకి ఎంట్రీ ఇచ్చి నేనున్నాను అనే లోపే.. బ‌న్నీ పుష్ప‌రాజుగా వ‌చ్చి.. లెక్క‌ల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టేశాడు. ఇవ‌న్నీ వారి టీజ‌ర్ల లెక్క‌లేనండి. మ‌రి ఎవ‌రి టీజ‌ర్ కు ఎక్కువ వ్యూస్ వ‌చ్చాయో చూద్దామా..

ఇప్ప‌టి వ‌ర‌కు రామరాజు ఫర్ భీమ్ గా వ‌చ్చిన ఎన్టీఆర్ టీజర్ కు 50.27 మిలియన్ వ్యూస్ వ‌చ్చాయి. ఇక దీని త‌ర్వాత బ‌న్నీ పుష్ప టీజర్ కు త‌క్కువ టైమ్ లోనే 47.38 మిలియన్ల వ్యూస్ ద‌క్కాయి. ఇక దీనికంటే ముందే వ‌చ్చిన భీమ్ ఫర్ రామరాజు టీజర్ కు 43.92 మిలియన్ల వ్యూస్ మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక్క‌డ మ‌రో హీరో బాల‌య్య కూడా త‌న అఖండ టీజ‌ర్‌తో మొద‌టిసారి 40.67 మిలియన్ల వ్యూస్ అందుకున్నాడు. ఇక గ‌తేడాది విడుద‌లైన మ‌హేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు టీజర్ 33.80 మిలియన్ల వ్యూస్ నమోదు చేసింది. ఇక వీట‌న్నింటినీ చూస్తుంటే.. బ‌న్నీ పుష్ప‌రాజు త్వ‌రలోనే మొద‌టి స్థానానికి వెళ్లేలా ఉంది. ఎందుకంటే అతి త‌క్కువ టైమ్ లోనే రెండో ప్లేస్ ఉన్న ఈ టీజ‌ర్‌… ఎన్టీఆర్ టీజ‌ర్ కంటే 3మిలియ‌న్ల వ్యూస్ మాత్ర‌మే త‌క్కువ‌గా ఉంది. త్వ‌ర‌లోనే దాన్ని దాటేస్తే బ‌న్నీ ఫ్యాన్స్ కు పండ‌గే.