ఫ్యాక్ట్ చెక్: శ్వాస సంబంధిత సమస్యలకి కారణం కరోనా ఏనా లేదా 5G రేడియేషన్ టవర్ నుండి వచ్చే విష గాలులా…? నిజమెంత..?

-

కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తున్నప్పటి నుంచి కూడా సోషల్ మీడియా లో అనేక రకాల ఫేక్ మెసేజెస్ ఎక్కువై పోయాయి. తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా శ్వాస పీల్చుకోవడం లో ఇబ్బందులు ఉన్నాయా లేదా 5జి టవర్ రేడియేషన్ ద్వారా గాలి కాలుష్యం వస్తోందా…?దీనిలో నిజం ఎంత…?

సోషల్ మీడియాలో 5జి టవర్ రేడియేషన్ కారణంగా గాలి కాలుష్యం వస్తోందని దీని కారణంగా శ్వాస పీల్చుకోవటం కష్టమవుతుంది అన్న వార్తలు షికార్లు కొడుతున్నాయి. దీని కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని… ఈ ఫేక్ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

2020 లో కరోనా వచ్చినప్పుడు కూడా 5జీ టెక్నాలజీ కారణంగా మొబైల్ టవర్స్ నుండి వచ్చే కాలుష్యం జనాల్ని ఇబ్బంది పెట్టిందని వార్తలు వినపడ్డాయి. బెల్జియం వార్తా పత్రిక లో అయితే ఈ 5 జీ కారణంగా ఇబ్బందులు వస్తాయి అన్న వార్తని కూడా మనం విన్నాం.

ఇలా వివిధ రకాల ఫేక్ పోస్టులు సోషల్ మీడియా లో తెగ కనబడుతున్నాయి. ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఏజెన్సీలు ఇటువంటి ఫేక్ మెసేజ్లని ఫార్వర్డ్ చేయొద్దని, జనాన్ని హెచ్చరించారు.

ఫ్యాక్ట్ చెక్:

కరోనా వైరస్ కారణంగా కాదు 5 జీ రేడియేషన్ ద్వారా గాలి కాలుష్యం అవుతోందని దీని కారణంగా ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలకు గురవుతున్నారు అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అయితే ఇది కేవలం ఫేక్ మరియు బేస్ లేని వార్త. ఇటువంటి ఫేక్ పోస్ట్ లకి జాగ్రత్తగా ఉండండి ఫార్వర్డ్ చెయ్యొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news