బన్నీ పాటను వాడేసుకున్న సల్మాన్ ఖాన్.. ఓ రేంజ్ లో ఉందంటున్న బన్నీ ఫ్యాన్స్

ఒక సినిమా హిట్ అయితే అది ఇతర భాషల్లో రీ మేక్ చేయడం సహజమే. ఎందుకంటే అది సినిమా విలువను మరింత పెంచుతుంది. మరి ఒక పాట హిట్ అయితే దాన్ని మిగతా సినిమాల్లో వాడుతారా అంటే అవును వాడొచ్చు. ఇప్పటికే ఈ తరహాలో పాటన వాడుకుని దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. అప్పట్లో తన సినిమా కోసం ఓ పాటను వాడుకున్నాడు.

గతంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన రింగ రంగా పాటను సల్మాన్ తన సినిమాలో వాడుకున్నాడు. అప్పుడు ఈ పాట ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభుదేవతో చేస్తున్న రాధే సినిమాలో కూడ ఓ పాటను వాడుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ పాట కూడా దేవి శ్రీ ప్రసాద్ దే. మరీ ముఖ్యంగా ఇది కూడా అల్లు అర్జున్ సినిమాలోనిదే.

ప్రభుదేవాతో కలిసి ఇప్పటికే వాంటెడ్, దబాంగ్ 3 లాంటి సినిమాలు చేశాడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఈ కాంబినేషన్లో మూడో సినిమా వస్తుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో సీటీ మార్ ను వాడుకున్నాడు సల్మాన్ ఖాన్. అల్లు అర్జున్ సినిమాలోని డిజె పాటకు సల్మాన్ స్టెప్పులు వేయనున్నాడు. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే డిజె సినిమా రీమేక్ లా కనిపిస్తోంది.ఏదేమైనా అల్లు అర్జున్ పాట ఉండడంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.