రంగస్థలం తర్వాత చరణ్ ‘స్టేట్ రౌడీ’

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం తర్వాత చేస్తున్న బోయపాటి మూవీకి టైటిల్ గా ఓ క్రేజీ టైటిల్ ప్రచారంలో ఉంది. 1989లో మెగాస్టార్ చిరంజీవి బి.గోపాల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా స్టేట్ రౌడీ. ఇప్పుడు చరణ్, బోయపాటి సినిమాకు ఆ టైటిల్ పెడుతున్నారట. రంగస్థలం చిట్టిబాబుగా రికార్డుల పని పట్టిన చరణ్ ఈసారి స్టేట్ రౌడీగా మిగులున్న రికార్డుల మీద కన్నేశాడు.

బోయపాటి సినిమా అంటేనే ఆ లెక్క వేరేలా ఉంటుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఓబేరాయ్ నటిస్తుండగా చరణ్ బ్రదర్స్ గా ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ చేస్తున్నారు. స్టేట్ రౌడీ టైటిల్ కన్ఫామా కాదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నారు. సినిమా మాత్రం 2019 జనవరిలో సంక్రాంతి రేసులో నిలుస్తుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news