సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి స్టార్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. టాలెంట్ ఉంటే చాలు.. ఎప్పటికైనా పైకి వస్తారు. ముఖ్యంగా టాలెంట్ ఉన్నోళ్లు ఈ టెక్రాలజీకి ఎంత దూరంలో ఉన్నా ఒక రోజు మాత్రం ప్రపంచానికి పరిచయమవ్వాల్సిందే. అలా తెలుగులోనే ఎంతో మంది ఉన్నారు. ఇటీవల ఓ బెంగాళీ అతను వేరు శనగ అమ్ముకునే వ్యక్తి సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు.
సోసల్ మీడియాలో కచ్చాబాదం సాంగ్ గురించి ఇప్పుడు తెలియని వారు లేరు. పల్లీలు అమ్మకుంటూ వీధ వీధి తిరిగి అమ్మేవాడు. మాసిన బట్టలు, అరిగిన చెప్పులు, నెరిసిన గడ్డం, కష్టాలకు కేరాప్ అడ్రస్‌గా తన జీవితం ఉండేది. రోజుకు 200 వచ్చినా చాలు అనుకునే భుజన్ అలా వీది వీధి తిరిగి పల్లీలు అమ్మేవాడు. భుజన్ కు భార్య, ఇద్దరు అబ్బయిలు, ఓ కుమార్తె కలరు.
ఆయన వీధి విధి తిరిగి రోజు మొత్తం గొంతు పోయేలా ఎంత అరిచినా పల్లెలు ఎవ్వరూ కొనే వార కాదట. అప్పుడే భుజన్‌కు ఓ ఆలోచి తట్టిందట. తానే స్వయంగా ఒక లిరిక్స్ రాసి.. పాట పాడి వీడియో రికార్డు చేసుకుని అది ప్లే చేసుకుంటూ పల్లీలు అమ్మేవాడు. ఆ పాటకు ఫిదా అయిన జనం ఎగబడి మరీ పల్లీలు కొనేవారట. ఈ తరుణంలోనే ఓ వ్యక్తి ఆ పాటను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ పాట వైరల్ అయింది.. ఇంకా అవుతూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఇలా ఎక్కడ చూసినా కచ్చాబాదం రీల్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియాలో వాయిస్ బాగుండి. ఒక ఊపు ఉంటే.. మీనింగ్ తెలియకపోయిన నెటిజన్లు ఇట్టే నేర్చుకుంటారు.
ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా ఈ సాంగ్‌కు అల్లుఅర్జున్ కూతురు అర్హ వేసిన డ్యాన్స్ మరొక ఎత్తు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ క్షణానా ఆ సాంగ్‌ను మొదలు పెట్టాడో తెలియదు కానీ.. ఆ సాంగ్ ఆ వ్యక్తి పాడినప్పుడూ వైరల్ అయితే.. ఇప్పుడు ఆ సాంగ్ కు చిన్నారులు వేసే స్టెప్పులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కూడా తెగ వైరల్‌గా మారుతున్నాయి. అల్లుఅర్జున్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. ఇప్పుడు అందరూ ఈ పాట గురించే చర్చించుకుంటున్నారు.
View this post on Instagram