భారీ ప్లాన్ వేసిన అల్లు అర‌వింద్‌.. ఆ సినిమా కోసం హాలీవుడ్ మేక‌ర్స్‌!

ప్ర‌స్తుతం సినిమా ఇడ‌స్ట్రీలో ప్యాన్ ఇండియా మూవీల హ‌వా న‌డుస్తోంది. ఒకేసారి నాలుగైదు భాషల్లోనే సినిమాలు చేసేందుకు సినీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో మార్కెట్ భారీగా పెరుగుతుంద‌ని భావిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర‌వింద్ కూడా రామాయణం 3డి కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేసేస్తున్నారు. ఇందులో ప‌లానా స్టార్లు న‌టిస్తారంటూ ఎప్ప‌టి నుంచో వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు దీని గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త చెక్క‌ర్లు కొడుతోంది.

 

చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీస్తున్న ఈ మూవీని అల్లు అరవింద్తో పాటు మధు మంతెన, నమిత్ మల్హోత్రా క‌లిసి నిర్మిస్తున్నారు. దీని కోసం ఏకంగా రూ.వెయ్యి కోట్ల వ‌ర‌కు పెట్టేందుకు వీరు రెడీ అవుతున్నారు. ఇందులో
రాముని పాత్ర కోసం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మ‌హేశ్‌బాబు శ్రీరాముడిగా చేస్తార‌ని తెలుస్తోంది. ఇక మిగిలిన వారికోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ భారీ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ అవతార్ కి పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ల బృందం వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. ఈ మూవీకి వారు అయితేనే బాగా చేస్తార‌ని అల్లు అర‌వింద్ భావిస్తున్నారంట‌. హృతిక్ రోష‌న్ రావణుడి పాత్ర చేయ‌నుండ‌గా.. దాన్ని డిజైన్ చేసేందుకు ఈ హాలీవుడ్ మేక‌ర్స్ రంగంలోకి దిగారంట‌.