యూపీ: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. ఫతేబాద్ దరియాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడి అరుపులు విన్న స్థానికులు రక్షించేందుకు యత్నించారు. కానీ బావిలోకి బాలుడు జారీ పోయాడు. మొత్తం 180 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని బయటకు తీసేందుకు సహాయ చర్యలు చేపట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తూ సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. బాలుడి పరిస్థితిని తెలుసుకునేందుకు మైక్రో కెమెరాలను బావిలోకి వేసేందుకు యత్నిస్తున్నారు.
ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడిని సురక్షితంగా బయటకు తీయాలని కోరుతున్నారు. తెరిచి ఉన్న బోరుబావులతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.