బడ్డీ రిలీజ్ ట్రైలర్.. అదిరిపోయిన యాక్షన్ సీన్స్..!

-

మొన్నటివరకు సినిమాల రిలీజ్ ముందు ఓ ట్రైలర్ వచ్చేది. కానీ ప్రస్తుతం అవి రెండు అయ్యాయి. సినిమా ట్రైలర్ అలాగే రిలీజ్ ట్రైలర్ అంటూ సినిమా విడుదలకు రెండు మూడు రోజుల ముందు చేస్తున్నారు. అయితే తాజాగా బడ్డీ సినిమా రిలీజ్ ట్రైలర్ ను నిర్వాహకులు విడుదల చేసారు. అల్లు శిరీష్, ప్రిషా సింగ్ జంటగా నటిస్తున్న ఈ బడ్డీ సినిమా ఆగస్టు 2న విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్.. మూవీపై అంచానాలు పెంచగా.. ఈ రిలీజ్ ట్రైలర్ దానిని రెట్టింపు చేసింది.

తాజాగా విడుదల అయిన ఈ ట్రైలర్ పూర్తిగా ఈ సినిమాలో ముఖ్యమైన టెడ్డీ బేర్ పైనే ఉంది. ఇందులో టెడ్డీ బేర్ చేసే యాక్షన్ సీన్స్ కు సంబంధించిన విజువల్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రాలీ వెనుక నిల్చుని.. KGF రాఖీ భాయ్ స్టైల్ లో టెడ్డీ బేర్ చేసే ఫైరింగ్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version