కాంగ్రెస్ నుండి BRS ఆ ఎమ్మెల్యే జంప్..?

-

తెలంగాణలో జరిగిన 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుండి BRS పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతూ వస్తున్నారు. మరికొందరు జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారు అనే వార్తలు కూడా వస్తున్న తరుణంలో.. ఈ ఎమ్మెల్యే మాత్రం అందుకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్ నుండి BRS పార్టీలోకి వస్తున్నారు అనే చర్చ నడుస్తుంది.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ తాజాగా అసెంబ్లీలోని KCR ఛాంబర్ లో సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు అని ఫోటోలు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసారు BRS శ్రేణులు. అయితే తాజా ఎన్నికల్లో BRS పార్టీ నుండే గెలిచిన ఆయన కాంగ్రెస్ లో చేరారు. కానీ అధికార కాంగ్రెస్ లో ఆయన ఇముడలేకపోవుతున్నారు అని.. అందుకే మల్లి సొంత గూటి వైపు చూస్తున్నారు అని తెలుస్తుంది. చూడాలి మరి గద్వాల ఎమ్మెల్యే మాదిరి వెంకట్రావ్ కూడా BRS లో తిరిగి చేరుతారా లేదా అనేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version