మెగా ఫ్యాన్స్‌పై అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

మెగా ఫ్యాన్స్‌పై అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు స్టూడియోస్ ను ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. అల్లు స్టూడియోస్ ను ఆవిష్కరించిన చిరంజీవి గారికి ధన్యవాదాలు అన్నారు. మా తాతగారి శత జయంతి ఓ ప్రత్యేక మైన రోజు..స్టూడియో అనేది లాభాపేక్ష కోసం పెట్టలేదని వెల్లడించారు.

తాతగారి కోరిక, వారి జ్ఞాపకంగా స్టూడియో పెట్టాము..ఇక్కడ చిత్రీకరణలు జరిగితే తాతాగారికి ఆనందంగా ఉంటుందని చెప్పారు. తాతగారు చనిపోయి18 ఏళ్లయినా, మా నాన్న గారికి వారిపై ప్రేమ పెరుగుతోంది.. నాపై అభిమానాన్ని చూపిస్తున్న మెగాభిమానులకు, నా ఆర్మీ కి ధన్యవాదాలు అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా నాన్నగారు శత జయంతి ..చనిపోయి 18 ఏళ్లయింది..అనేక మధ్యమల్లో ఇప్పటికీ ఆయన కన్పిస్తున్నారన్నారు. స్టూడియో అనేది ఓ జ్ఞాపిక.. లాభాపేక్ష కోసం కట్టింది కాదు.. గీతా ఆర్ట్స్ , అల్లు స్టూడియో , ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నానని చెప్పారు.