నాగార్జున ఏ క్షణాన మన్మథుడు 2 సినిమాను స్టార్ట్ చేశాడో కాని ఆ సినిమా రిలీజ్ అయ్యాక నాగ్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసి పడేసింది. బోల్డ్, అడల్ట్ సినిమా కంటెంట్తో తెరకెక్కిన సినిమా కావడంతో మన్మథుడు 2 కాసుల వర్షం కురిపిస్తుందని లెక్కలు వేసుకున్నారు. కానీ రిలీజ్ అయ్యాక నాగ్‌తో పాటు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. ఇలా అందరి లెక్కలు తప్పాయ్. సినిమాకు ఘోరమైన ప్లాప్ టాక్ రావడం ఒక మైనస్ అయితే చివరకు నాగ్‌పై వస్తోన్న విమర్శలకు లెక్కే లేకుండా పోయింది.
అన్నపూర్ణ స్టూడియోస్ ట్విట్టర్ హ్యాండిల్ లో “ ఈ వారంతంలో ‘ఫన్’టాస్టిక్ బ్రీజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన్మథుడు 2′ ను మీ దగ్గరలోని థియేటర్లలో చూడండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రీట్వీట్ చేసిన నాగార్జున సతీమణి అమల “నవ్వి నవ్వి సీట్ నుంచి పడిపోయా. సినిమాతో లవ్ లో పడిపోయా. పూర్తిగా న్యూ ఏజ్.. ఫిలిం.. అవుట్ రేజియస్ లీ బ్యూటీఫుల్ #మన్మథుడు2” అని తన రిప్లే ఇచ్చింది.
అమలు చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. మన్మథుడు 2 టైటిల్ మార్చాలని కొందరు అంటుంటే, మరికొందరు థియేటర్లో చాలా మంది స్పృహ తప్పిపోయారు… మీరు గమనించలేదా ? అని సెటైర్ వేశారు. అమల అక్కినేని గారు ఇంకా పూర్తిగా తెలుగు నేర్చుకున్నట్టు లేదు. సినిమా అంతా అడల్ట్ కంటెంటే. ఇదెలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది ? అని మరికొందరు ప్రశ్నించారు.
మీరు చూసింది త్రివిక్రమ్ మన్మథుడు అనుకుంటా మేడమ్ గారు అని మరొకరు కామెంట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని కామెంట్లు చాలా ఘాటుగా ఉన్నాయి. ఒక నెటిజన్ మాత్రం “ మేడమ్.. సార్ ను మంచి సినిమాలు తీయమని చెప్పండి ” అంటూ విన్నవించుకున్నాడు. ఏదేమైనా నాగ్ మీద కోపాన్ని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఇలా అమలపై తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.
Laughed till I fell off my seat ??. Loved the film – totally new age and outrageously beautiful ?#Manmadhudu2 ? https://t.co/iN0Q62ZUFB
— Amala Akkineni (@amalaakkineni1) August 10, 2019