సరికొత్త కథనాంశంతో ట్రైలర్ తో అదరగొడుతున్న అమలాపాల్..!!

-

ప్రేమఖైధీ డబ్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అమలాపాల్. ఆ తర్వాత పలువురు హీరోల సరసన నటించి బాగానే పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక తను నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ప్రముఖ డైరెక్టర్ అయినా v.L.విజయ్ ను వివాహం చేసుకుంది. అయితే కొన్ని కారణాలవల్ల అతనితో కూడా విడిపోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి మళ్లీ సినిమాలలో నటించేందుకు సిద్ధమయ్యింది.. ఆ తరువాత పలు ప్రయోగ సినిమాలకు చేయడానికి సిద్ధమయ్యింది అమలాపాల్ అలా చేసిన సినిమానే ఆమె. ఈ సినిమాలో ఈమె నగ్నంగా నటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ సినిమాకి ఈమెకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడా చాలానే దక్కించుకుంది.

ఇప్పుడు కూడా మరొకసారి ఒక ఛాలెంజింగ్ రోల్ పాత్రతో తమ అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఇక ఆ సినిమా పేరే కడవర్. ఈ సినిమా మలయాళీ అనూప్ పనికర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం కూడా ఒక థ్రిల్లర్ చిత్రం కావడం గమనార్హం. ఇందులో పోలీసు అధికారిగా అమలాపాల్ నటించడం జరిగింది ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్టర్ గా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ థ్రిల్లింగ్ ఎలివేషన్ తో బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రం ఆగస్టు 12న తమిళ్, తెలుగు భాషలలో విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది. ఇక ఇందులో అమలాపాల్ నటన ఎంతో అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ లో ఈమె సరికొత్తగా కూడా కనిపిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైమ్ సినిమాలకు మంచి సక్సెస్ అందుతోంది.. మరి ఇ తరుణంలో అమలాపాల్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news