మిడిల్ క్లాస్ పై చర్చ.. అమెజాన్ వాళ్ళు అంత పెట్టారా?

-

నిశ్శబ్దం, వి సినిమాల తర్వాత అమెజాన్ వాళ్ళు ఆచితూచి అడుగేస్తున్నారు. ఏది పడితే అది కొనకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఒక్క సినిమా విషయంలో అమెజాన్ అందరికీ షాకిచ్చింది. అదే మిడిల్ క్లాస్ మెలోడీస్. నవంబరు 20వ తేదీ నుండి అమెజాన్ లో అందుబాటులో ఉండనున్న ఈ సినిమాకి 4.5కోట్లు పెట్టి కొన్నారని వార్తలు వస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ నటించిన రెండవ చిత్రానికి ఈ రేంజిలో ధర పలకడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఆనంద్ మొదటి చిత్రమైన దొరసాని అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రానికి ఆనంద్ మార్కెట్ కి మించి పెట్టారని చెప్పుకుంటున్నారు. ఐతే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. మధ్యతరగతి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించబోతుందని చాలామంది నమ్ముతున్నారు. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం ఆనంద్, మిడిల్ క్లాస్ అబ్బాయిగా చక్కగా సరిపోయాడు. మరి అమెజాన్ పెట్టిన డబ్బులకి ఆశించినంత ఫలితం ఇస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news