God Father: చిరు ‘గాడ్‌ ఫాదర్‌’ కోసం రంగంలోకి అమెరికా పాప్ సింగ‌ర్‌!

-

God Father: మెగాస్టార్ చిరంజీవి.. పాలిటిక్స్ త‌రువాత‌ రీ ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మరిపోయారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య, అటు మోహన్‌ రాజాతో గాడ్‌ ఫాదర్‌. మ‌రో వైపు.. బాబీ డైరెక్షన్‌లో భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవలే ఆచార్య పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌ను ప్రారంభించాడు.

ఈ చిత్రం కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ వరుసగా బయటకు వస్తున్నాయి. ఈ మూవీలో నటించే హీరోయిన్స్‌, మిగతా తారగణంకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి మ‌రో లేటేస్ట్ అప్డేట్ వ‌చ్చింది. ఈ చిత్రంలో ఫేమస్, హాలీవుడ్ పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్‏తో ఓ పాట పాడించడానికి ప్లాన్‌ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ విష‌యంపై ఆమెతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. చిరు సూచన మేరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఈ ప్ర‌యోగం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే.. అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ ఒక్కొ పాటకు దాదాపు 20 నుంచి 30 కోట్లు రూపాయల పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ఈ వార్త నిజ‌మైతే.. ఆమెకు భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇంతటి డిమాండ్‌ ఉన్న బ్రిట్నీ స్పియర్‌తో పాట పాడిస్తారా? లేక ఇది వార్తలకే పరిమితమవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news