అమీ జాక్సన్ ఇలా షాక్ ఇచ్చిందేంటి

-

సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ తన ఫ్యాన్స్ ను ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా గ్లామర్ షో చేస్తుంది. మద్రాస్ పట్టణం సినిమాతో తమిళ పరిశ్రమకు పరిచయమైన అమ్మడికి ఇక్కడ మంచి ఆఫర్స్ రావడంతో వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో కన్నా ఎమీ జాక్సన్ తమిళ, హింది సినిమాలు బాగా చేసింది.

ఇక సినిమా కెరియర్ ముగించాలని అందుకుందో ఏమో కాని కొన్నాళ్లుగా కలిసి తిరుగుతున్న తన బోయ్ ఫ్రెండ్ జార్జ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ప్రకటించింది అమీ జాక్సన్. అతనితో చాలా క్లోజ్ గా ఉంటూ అమీ జాక్సన్ దిగిన పిక్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. న్యూ ఇయర్ గిఫ్ట్ గా తన ఫ్యాన్స్ కు తన ఎంగేజ్మెంట్ న్యూస్ చెప్పింది ఎమీ జాక్సన్.

తనని సంతోషంగా ఉంచినందుకు జార్జ్ కు థ్యాంక్స్ అంటూ కామెంట్ పెట్టింది ఎమీ జాక్సన్. న్యూ ఇయర్ లో కొత్త జీవితాన్ని ప్రారంభించామని.. ఐలవ్యూ జార్జ్ అంటూ తన ఎంగేజ్మెంట్ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చింది ఎమీ జాక్సన్. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా నటించిన 2.ఓ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news