52 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో రిలీజ్ అవుతున్న భారతీయ మూవీ.. ఇంత గ్యాప్ ఎందుకంటే!

-

బంగ్లాదేశ్ల: ఈ ఏడాది మొదట్లో విడుదలైన పటాన్ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్లో అత్యంత పెద్ద విజయాన్ని నమోదు చేసింది. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఈ చిత్రం ప్రతి చోట విజయం సాధించింది. షారుక్ ఖాన్, దీపికా పదుకొనే ఈ చిత్రంలో నటించగా సిద్ధార్థ ఆనంద్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం షారుఖ్ కెరియర్ లో మాత్రమే కాకుండా దీపికా పదుకొనే, సిద్ధార్థ ఆనంద్ కెరియర్లో కూడా బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయింది. కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది.

Pathan Movie Apk v1.1 Download For Android [Watch Movie]

స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దీపికా పదుకొనే జంటగా నటించిన పటాన్ చిత్రానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. అదేమిటి అనగా ఈ చిత్రం ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా రిలీజ్ అవ్వబోతోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే బంగ్లాదేశ్లో ఒక హిందీ చిత్రం విడుదలయ్యి దాదాపు 52 సంవత్సరాలు అవుతోంది. బంగ్లాదేశ్ కు స్వతంత్రం వచ్చిన మొదట్లో అక్కడ ఉండే చిత్రసీమను రక్షించేందుకు హిందీ చిత్రాలను ఆ దేశంలో బ్యాన్ చేశారు. మరలా 2010లో హిందీ చిత్రాల పైన నిషేధాన్ని తొలగించారు. కానీ బంగ్లాదేశ్లో కొంతమంది వర్గం ఆందోళన వ్యక్తం చేయగా మరల బ్యాన్ విధించారు.

భారతీయ చిత్రాలను బంగ్లాదేశ్లో బ్యాన్ చేయడం వలన ఆ ఆ దేశంలో థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గి అక్కడ ఉన్న చిత్ర సీమ అభివృద్ధిని సాధించలేదు. అందువలన బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వం అక్కడ ఉన్న చిత్రసీమను అభివృద్ధి చేసేందుకు 2023లో భారతీయ చిత్రాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. కావున పటాన్ చిత్రం బంగ్లాదేశ్లో నిషేధం ఎత్తివేసిన తర్వాత రిలీజ్ అవ్వబోతున్న మొదటి హిందీ చిత్రంగా నిలిచిపోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news