కరోనా టైమ్ లో థియేటర్లలో నింపడానికి సోలోగా వస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రమోషన్లని మొదలెట్టింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఆసక్తి రేపిన ఈ చిత్రం తాజాగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ప్రేమ, పెళ్ళి వేస్ట్ అని చెప్తూ సోలో లైఫే బెటర్ అని చెప్పే సాయి తేజ్ ఒక పుస్తకం రాస్తాడు. అందులో పెళ్ళి ఎందుకు చేసుకోకూడదో, రిలేషన్ షిప్ లోకి ఎందుకు దిగకూడదో శ్లోకాల ద్వారా ఉదాహరణలు చెప్పి మరీ వివరిస్తాడు. అందులో నుండి ఒకానొక శ్లోకాన్ని ఈ రోజు రిలీజ్ చేసారు.
బ్రతికి ఉన్నప్పుడు హాయిగా బ్రతికి చచ్చాక స్వర్గం చేరుకోవాలని అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే భూమ్మీద ఎలా బ్రతికినా చచ్చాక స్వర్గం చేరుకోవాలని అనుకునేవాళ్ళు కోకొల్లలు. ఐతే స్వర్గానికి అంత డిమాండ్ ఎందుకుందో సాయి తేజ్ చెప్పేసాడు. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక ఉంటారని అందరికీ తెలుసు. వారికి పెళ్ళి కాలేదని కూడా తెలుసు. వారికి పెళ్ళి కాలేదు కాబట్టే స్వర్గానికి అంత డిమాండ్ ఉందట. ఒకవేళ వారు ప్రేమలోనో, పెళ్ళి చేసుకునో ఉంటే స్వర్గానికి అంత డిమాండ్ ఉండేది కాదట.