Anantha Sriram: కశ్మీర్ టు హైదరాబాద్..థమన్‌కు అనంత శ్రీరామ్ ప్రత్యేక బహుమానం

టాలీవుడ్ యంగ్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్..పాటల గురించి తెలుగు సినీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీత రచయితగా చక్కటి పేరు సంపాదించుకున్న అనంత శ్రీరామ్ ..తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలందరి సినిమాల్లో దాదాపుగా పాటలు రాశారు.

ఇటీవల విడుదలైన మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’..‘కళావతి’ సాంగ్ రైటర్ కూడా ఆయనే. ‘సర్కారు వారి పాట’ చిత్రంలో పాటలకు అనంత శ్రీరామ్ లిరిక్స్ కు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ యాడ్ అయింది. అలా ‘కమాన్ కమాన్ కళావతి’ పాట పాపులర్ అయింది.

ఈ సంగతులు పక్కనబెడితే..అనంత శ్రీరామ్ ..మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు ఏదేని ప్రత్యేకమైన బహుమానం ఇవ్వాలనుకున్నారు. అయితే, అది థమన్ చాలా ఇష్టపడేది అయి ఉండాలని భావించిన లిరిసిస్ట్ శ్రీరామ్..ప్రత్యేకంగా క్రికెట్ బ్యాట్ తయారు చేయించారు.

కశ్మీర్ లోని పుల్వామాలో ఉన్న బ్యాట్ ఫ్యాక్టరీలో థమన్ కోసం ప్రత్యేకంగా కస్టమ్ మేడ్ బ్యాట్ తయారు చేయించారు అనంత శ్రీరామ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు అనంత శ్రీరామ్.

తాను కశ్మీర్ నుంచి ప్రియమైన బహుమానం తీసుకొస్తున్నానని ‘సర్కారు వారి పాట’ నుంచి మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ త్వరగా రావాలని కోరారు అనంత శ్రీరామ్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇక ఈ బహుమతి గురించి తెలుసుకుని థమన్ ఏ విధంగా ఎగ్జైట్ అవుతారో చూడాలి..