బ్యూటీఫుల్ బటర్ ఫ్లై.. తూనీగ డ్రెస్సులో అనన్య పాండే

-

బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యా పాండే వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ భామ నెట్ ఫ్లిక్స్ మూవీ ఖో గయే హమ్ కహా సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది. మరో మూడు నాలుగు ప్రాజెక్టులు ఈ భామ చేతిలో ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో కలిసి నటించిన లైగర్ తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా అనన్యా అందానికి మాత్రం తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

ఇక సోషల్ మీడియాలోనూ అనన్య చాలా పాపులర్. ఈ భామ తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బటర్ ఫ్లై డ్రెస్సులో కనిపించి సందడి చేసింది. బటర్ ఫ్లై టాప్ తో బ్లాక్ కలర్ మ్యాక్సీతో ఈ భామ చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news