మొన్న శ్రీముఖి, ఇక నెక్స్ట్ అనసూయేనా…..??

-

ప్రస్తుతం బుల్లితెరపై తమ ఆకట్టుకునే యాంకరింగ్ టాలెంట్ తో దూసుకుపోతున్న ఫిమేల్ యాకర్స్ లో అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి అందరికంటే ముందు వరుసలో ఉంటారు అనే చెప్పకతప్పదు. ఈ ముగ్గురు కూడా బుల్లితెరతో పాటు ఇటీవల కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ మంచి పేరు గడిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే వీరిలో శ్రీముఖి, ఈటివి ప్లస్ షోలో ప్రసారం అయ్యే పటాస్ షో ద్వారా ఎంతో పాపులర్ అయింది. అంతేకాక మొన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 3లో కూడా సెలెక్ట్ అయి పార్టిసిపేట్ చేసింది.

అయితే శ్రాయశక్తులా ఆ షోలో ఎంతో తెలివిని ప్రదర్శించి ఆడిన శ్రీముఖి, ఫైనల్ స్టేజి వరకు చేరినప్పటికీ, ఫైనల్ లో కేవలం రన్నరప్ గా మాత్రమే మిగిలిపోయింది. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈసారి జరుగబోయే బిగ్ బాస్ సీజన్ 4లో మరొక యాంకర్ అనసూయ భరద్వాజ్ పార్టిసిపేట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. నిజానికి గత సీజన్లో నే ఆమె పార్టిసిపేట్ చేయవలసిందని, అయితే అప్పట్లో కొన్ని షూటింగ్స్ ఆల్రెడీ షెడ్యూల్ చేసిన కారణంగా ఆమె పాల్గొనలేకపోయారని, అయితే ఈ సారి రాబోయే సీజన్లో ఆమె తప్పకుండా పాల్గొనబోతున్నారని అంటున్నారు.

అంతేకాక రెండు రోజుల క్రితం బిగ్ బాస్ తదుపరి సీజన్ లో పార్టిసిపేట్ చేయవలసిందిగా ఆమెకు ఆహ్వానం వచ్చినట్లు చెప్తున్నారు. అయితే అందుకు సమ్మతించిన అనసూయ, ఆ ప్రోగ్రాం కి అనుగుణంగా తన షూటింగ్ షెడ్యూల్స్ ని ఇప్పటినుండే సెట్ చేసుకుంటున్నట్లు సమాచారం. అలానే ఆమెకు ఈ షో ద్వారా రెమ్యూనరేషన్ కూడా భారీగానే ముట్టజెప్పబోతోందట బిగ్ బాస్ టీమ్. ఇప్పటివరకు రీల్ పైనే అదరగొట్టిన మన రంగమ్మత్త, ఇకపై రియల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో చూడాలంటె మాత్రం వచ్చే ఏడాది బిగ్ బాస్ 4 సీజన్ ప్రారంభం అయ్యే వరకు వేచి చూడాలి మరి. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది….!!

Read more RELATED
Recommended to you

Latest news