కథనం టీజర్.. అనసూయ విశ్వరూపం..!

-

అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్ లో రాజేష్ నాదెండ్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా కథనం. మహిళా దినోత్సవం సందర్భంగా కొణిదెల ఉపాసన కథనం టీజర్ ను రిలీజ్ చేశారు. సినిమా డైరక్టర్ గా ఓ కథ రాసుకున్న అనసూయ ఆ కథలో తను రాసుకున్నట్టుగా బయట మర్డర్లు జరుగుతుండటంతో ఆమెను పోలీసులు టార్గెట్ చేస్తారు. ఇంతకీ అసలు ఆమె వెనుక ఏం జరుగుతుంది అన్నది సినిమా కథ.

ఈ సినిమాకు కథనం అన్న టైటిల్ కూడా బాగా యాప్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక యాంకర్ గా బుల్లితెరను ఏలేస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటాలని చూస్తుంది. ఆల్రెడీ రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ కథనం సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. నూతన దర్శకుడు రాజేష్ నాదెండ్ల సినిమాను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. టీజర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఇది ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version