మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రూ.2 కోట్లు ఇస్తా.. థాయ్‌ వ్యాపారి ఆఫ‌ర్‌..!

-

థాయ్‌లాండ్‌కు చెందిన వ్యాపారి ఆర్నావ్ రోడాంగ్ త‌న కుమార్తె కర్నిస్టాను పెళ్లి చేసుకున్న యువ‌కుడికి రూ.2 కోట్ల‌ను ఇస్తాన‌ని ఏకంగా ఫేస్‌బుక్‌లోనే ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. దీంతో ఇప్పుడా ప్ర‌క‌ట‌న నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

మ‌న దేశంలో వ‌ధువు నుంచి వ‌రుడు క‌ట్నం తీసుకోవ‌డ‌మనే దురాచారం ఎప్ప‌టి నుంచో ఉంది. ఇప్ప‌టికీ ఈ తంతు కొన‌సాగుతూనే ఉంటుంది. అది వేరే విషయం. అయితే విదేశీయులు కూడా ఇలా త‌మ ఆడ‌పిల్ల‌ల‌ను పెళ్లాడే యువ‌కుల‌కు క‌ట్నం ఇస్తారా ? అంటే.. ఎవ‌రైనా లేదు.. వాళ్ల ద‌గ్గ‌ర ఆ ఆచారం ఎందుకుంటుంది ? అంటారు.. అవును, విదేశాల్లో వ‌ర‌క‌ట్నం అనేది దాదాపుగా మ‌న‌కు కనిపించ‌దు. కానీ ఆ థాయ్ వ్యాపారి మాత్రం తన కుమార్తెను వివాహం చేసుకున్న వరుడికి ఏకంగా రూ.2 కోట్ల‌ను ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అయితే అది క‌ట్నం రూపంలో మాత్రం కాదు సుమా.. బ‌హుమ‌తి కింద.. అవును, నిజ‌మే. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

థాయ్‌లాండ్‌కు చెందిన వ్యాపారి ఆర్నావ్ రోడాంగ్ త‌న కుమార్తె కర్నిస్టాను పెళ్లి చేసుకున్న యువ‌కుడికి రూ.2 కోట్ల‌ను ఇస్తాన‌ని ఏకంగా ఫేస్‌బుక్‌లోనే ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. దీంతో ఇప్పుడా ప్ర‌క‌ట‌న నెట్‌లో వైర‌ల్ అవుతోంది. అయితే ఆర్నావ్ అలా డ‌బ్బును ఎందుకు ఇస్తానన్నాడంటే.. త‌న కుమార్తె మ‌నస్సుకు న‌చ్చిన వ‌రుడు ఇంకా ల‌భించ‌లేద‌ట‌. అందుక‌ని ఆమెకు న‌చ్చిన యువ‌కుడికి అంత మొత్తం ఇస్తాన‌ని అత‌ను ప్ర‌క‌టించాడు. అయితే మ‌రి ఆ యువ‌తి అంద విహీనంగా ఉంటుందా ? ఏమైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయా ? అంటే కాదు.. ఆమె అందగత్తే.. కానీ ఆమె మ‌న‌స్సుకు న‌చ్చిన వాడు మాత్రం ఇంకా దొర‌క‌లేద‌ట‌.

అయితే త‌న‌కు కాబోయే అల్లుడికి ఆస్తి, చ‌దువు లేక‌పోయినా ఫ‌ర్వాలేద‌ట‌. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే స్వ‌భావంతోపాటు త‌న కుమార్తెను ప్రేమ‌గా చూసుకునే యువ‌కుడు అయితే చాల‌ట‌. అలాంటి యువ‌కుడు ఇంకా దొర‌క‌లేదని, క‌నుక ఆస‌క్తి ఉన్న ఎవ‌రైనా, ఏ దేశానికి చెందిన‌వారైనా, ఏ కులం, మ‌తం వారైనా సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని ఆర్నావ్ అంటున్నాడు. త‌న కుమార్తె ఇష్ట‌ప‌డే యువ‌కుడు ఇంకా దొర‌క‌లేద‌ని, ఎవ‌రైనా అలాంటి వారు క‌నిపిస్తే రూ.2 కోట్లు ఇస్తాన‌ని అత‌ను చెబుతున్నాడు. ఏది ఏమైనా.. ఆర్నావ్ చేసిన ప్ర‌క‌ట‌న భ‌లే ఆసక్తిగా ఉంది క‌దా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version