జబర్దస్త్ కు వీడ్కోలు పలికిన అనసూయ.. కన్నీటి పర్యంతమైన కమెడియన్స్..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలలో జబర్దస్త్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.. ఇకపోతే గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఈ కామెడీ షో నుంచి తాజాగా పలువురు కమెడియన్లు, యాంకర్స్ అలాగే జడ్జిలు కూడా వెళ్లిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే నాగబాబు , రోజా, సుధీర్ , గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు వెళ్లిపోయి ఆశ్చర్యాన్ని కలిగించగా.. ఇప్పుడు మరొకసారి హాట్ యాంకర్ అనసూయ కూడా వీడ్కోలు చెప్పనుంది. ఈ క్రమం లోనే జబర్దస్త్ నుంచి తాజాగా ప్రోమో విడుదలవగా అందులో అనసూయ వీడ్కోలు పలుకుతున్నట్లు.. అందులో ఇంద్రజాతో పాటు పలువురు కమెడియన్లు కన్నీటి పర్యంతమైనట్లు మనం చూడవచ్చు. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా నెట్టింట వైరల్ గా మారుతుంది.

ఇక అసలు విషయం ఏమిటంటే.. నిజానికి జూన్ నెలలోనే తాను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నట్లుగా సంకేతాలు ఇస్తూ సోషల్ మీడియా ద్వారా అధికారిక పోస్ట్ చేసిన అనసూయ.. ఇక తన కెరియర్ లోనే అతిపెద్ద నిర్ణయం తీసుకున్నానని ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందంటూ పోస్ట్ కూడా పెట్టింది. కానీ ఇప్పటివరకు జబర్దస్త్ ను వీడలేదు.. కానీ ఇప్పుడు పూర్తిగా వీడ్కోలు పలుకుతూ.. జబర్దస్త్కు ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఈ షో మాత్రం పర్మినెంట్ అనే సందేశాన్ని ఇచ్చినట్టుగా ప్రోమోను వదిలారు.

ఇక తాగుబోతు రమేష్ అనసూయ లాగా లేడీ గెటప్ లో వచ్చి” నేను నిజంగానే జబర్దస్త్ మానేయాలి అనుకుంటున్నాను” అని చెప్పేసాడు. ఇక వెంటనే వెంకీ వచ్చి చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని మీ అమ్మగారికి ఇచ్చి జబర్దస్త్ కోసం పనిచేశారు కదా ఇప్పుడు జబర్దస్త్ ను వదిలేయడం ఏంటి మేడం ?అంటూ ఎమోషనల్ డైలాగ్ విసిరాడు. ఇక ఈమెను ఎంతో ఎమోషనల్ గా ఏడిపించాలని ప్రయత్నం చేసినా అనసూయ మాత్రం ఏడవలేదు. కానీ ఇంద్రజ మాత్రం పాత సినిమాలో హీరోయిన్ లాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.

నెలలో మూడు రోజులు మా కోసం కేటాయించలేవా అని చలాకి చంటి అంటే .. రాకెట్ రాఘవతో ఎవరు వెళ్లినా సరే జబర్దస్త్ ఆగదు అన్నట్టుగా కంక్లూజన్ ఇప్పించారు. మొత్తానికైతే జబర్దస్త్ మిస్ అవుతున్నాను అనే భావన అనసూయలో ఎక్కడ కనిపించలేదు. ఇక దీన్ని బట్టి చూస్తే ఈమె సంతోషంగానే జబర్దస్త్ కు వీడ్కోలు పలుకుతోందని సమాచారం.