తిక్క పనులు చేయడం అంటే చిన్నపిల్లలకు బాగా ఇష్టం ఉంటుంది. వాళ్లకు తెలియకుండానే కొన్ని అలవాట్లు చేస్తుంటారు. పెద్దోళ్లు చూసినప్పుడల్లా తిడుతుంటారు.? గోళ్లుకొరకడం, ముక్కులో వేళ్లు పెట్టడం లాంటివి చేస్తే ఎవరైనా తిట్టక ముద్దెట్టుకుంటారా.? ఇవి పేరుకు చెడు అలవాట్లైనా వీటి వల్ల కూడా మంచి జరుగుతుంది అంటున్నారు నిపుణులు..! చెడులోంచి కూడా మంచి వెతుక్కోవడం అంటే ఇదేనేమో..! ఇలాంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనకు మంచి చేసేవి ఉన్నాయి అవేంటంటే..
గోళ్ళు కొరకడం :
గోళ్ళు కొరకడం అనే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఒక్కోసారి మానసిక ఒత్తిడి వలన వాళ్లకు తెలియకుండానే గోళ్ళు కొరికేస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదని అంటుంటారు. కొన్ని పరిశోధనల ప్రకారం.. గోళ్ళు కొరకడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
ముక్కులో వేలు పెట్టి తిప్పడం:
పెద్దయ్యాక ఈ అలవాటు పోతుంది కానీ…చిన్నప్పుడు ప్రతిసారీ ముక్కులో వేలు పెట్టి తిప్పుతుంటారు. ఇది చూడ్డానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా అసహ్యంగా ఉండే చెడు అలవాటు. దీనివలన మంచి జరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎలర్జీలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు.
అటు ఇటు కదలడం :
కొంతమందికి తిన్నగా ఒక దగ్గర కుర్చోరు. అటూ ఇటూ కదలడం వల్ల శరీరంలో న్యూరో కెమికల్స్‌ను ప్రేరేపించి జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా పని ఒత్తిడి తగ్గించుకోడానికి కూడా ఉపయోగపడుతుంది.
గాసిప్స్ వినడం :
ఇదైతే అందరిలో ఉంటుంది. మనలో చాలా మందికి గాసిప్స్ వినడం అంటే ఎంతో ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అన్నిటికంటే అతి పెద్ద చెడ్డ అలవాటు ఇదే. కానీ ఇందులో కూడా మంచి ఉంది. గాసిప్స్ వినడం ద్వారా తోటి వ్యక్తులతో స్నేహం కుదురుతుంది. గ్రూప్ కమ్యూనికేషన్ అనేది మెరుగవుతుంది. ఒత్తిడి, టెన్షన్ వంటివి తగ్గిస్తుంది.
వీడియో గేమ్స్ ఆడటం :
నూటికి 90 శాతం వీడియోగేమ్స్ ఆడనివారు అంటే ఉండరు. వీడియో గేమ్స్ ఆడటం వల్ల చేతికి కంటికి మధ్య కోఆర్డినేషన్ పెరుగుతుంది. వీడియో గేమ్స్ ఆడే వారిలో ఎలాంటి చాలెంజ్ నైనా స్వీకరించే శక్తి కలిగి ఉంటారు. మొదలుపెట్టిన పనిని విజయం సాధించే వరకు వదలరు. వీడియో గేమ్స్ ఆడే వాళ్ళు ఆలోచన శక్తి మామూలు వ్యక్తి కన్నా చాలా వేగంగా ఉంటుంది.
గ్యాస్ వదలడం :
ఇది మనం ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్న ఆపుకోలేని చెడు అలవాట్లలో ఒకటి. గ్యాస్ వదలడం అనేది అదుపు చేసుకోవడం వలన మన ఆరోగ్యంపై ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. గ్యాస్ అదుపులో పెట్టుకోవడం హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన పొట్టలో ఏర్పడిన గ్యాస్ ఎప్పటికప్పుడే వదిలేయడం మంచిది. దీనివలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మెటికలు విరవడం :
ప్రతి ఒక్కరిలో ఎక్కువగా ఉండే అలవాటు చేతి వేళ్లను విరవడం. చేతి వేలు విరగడం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
చూయింగ్ గమ్ నమలడం:
కొంతమందికి ఎక్కువగా చూయింగ్ గమ్ నములుతుంటారు. ఆ అలవాటు అనేది ఎదుటి వారికి అసహ్యంగా అనిపిస్తుంది. చూయింగ్ గమ్ నమలడం వలన బ్రెయిన్ పవర్ మెరుగవుతుంది. అంతే కాకుండా ఆకలిని అదుపు చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. చూయింగ్ గమ్ నవ్వడం వలన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి.
పగటి కలలు కనడం :
చాలా మంది పగటిపూట నిద్రపోతూ కలలుకంటుంటారు. ఇలా చేయడం వల్ల మీ సమయం వృధా అవుతుంది అనుకుంటాం. కానీ దీని వలన మనకు ఈ దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఎందుకంటే పగలా పూట నిద్రపోయేవారిలో బ్రెయిన్ సెల్స్ ఎంతో యాక్టివ్‌గా ఉంటాయని తేలింది.
ఆలస్యంగా నిద్రలేవడం :
మనలో చాలా మందికి ఉదయాన్నే లేచి అలవాటు తక్కువ. ఆలస్యంగా నిద్రలేవడం అనేది చెడు అలవాటు. కానీ ఈ సరిపోయినంత నిద్ర పోవడం అనే అలవాటు మనసులోని టెన్షన్‌ను తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి, మనిషి ఆయుష్షును పెంచుకోవడానికి సహాయపడుతుంది. నిద్ర అనేది సరిగ్గా లేకపోతే అనవసరమైన ఒత్తిడి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి.