టాటూ సీక్రెట్ చెప్పిన అనసూయ..!

-

బుల్లితెర యాంకర్ గా జబర్దస్త్ కెరియర్ కొనసాగిస్తున్న అనసూయ ఈమధ్య సినిమాల్లో కూడా బిజీగా మారింది. బుల్లితెర మీద యాంకరింగ్ తో తన అందాల విందుతో ప్రేక్షకులను అలరించే అనసూయ సిల్వర్ స్క్రీన్ పై తన ప్రతాపం చూపిస్తుంది. ఇక ఎంత బిజీగా ఉన్న తన ఫ్యాన్స్ తో ఎప్పుడు టచ్ లో ఉండే అనసూయ న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్ తో చేసిన చిట్ చాట్ లో తన టాప్ సీక్రెట్ బయట పెట్టింది.

నెలకో ఫోటో షూట్ తో కుర్రాళ్లకు వెర్రెక్కేలా చేసే అనసూయ తన టాటూ కనిపించేలా స్టిల్స్ ఇస్తుంది. ఇంతకీ అనసూయ ఎద పై భాగాన ఉన్న ఆ టాటూ ఏంటి.. దాన్ని ఎందుకు అక్కడ వేసుకుంది అన్నది కనుక్కోవాలని అందరికి ఉంటుంది. ఇదే విషయాన్ని ఓ అభిమాని అడిగాడు అయితే అది తన భర్త పెట్ నేమ్ నిక్కూ అని చెప్పింది అనసూయ. తన భర్త పెట్ నేమ్ తన పచ్చబొట్టుగా వేయించుకుంది అనసూయ. ఇక తన కెరియర్ లో మొదటి రెమ్యునరేషన్ విషయాలను పంచుకుంది అమ్మడు. 5,500 రూపాయలు తొలి రెమ్యునరేషన్ అందుకున్నట్టుగా చెప్పింది అనసూయ. మొత్తానికి అనసూయ చెప్పిన ఈ విషయాలు ఆమె ఫ్యాన్స్ కు భలే థ్రిల్ కలిగిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version