అనన్య నాగళ్ల తంత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా.. భయపెట్టేసిందిగా..?

-

అనన్య నాగళ్ల.. ఈ తెలుగందం మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రెండో సినిమాలో ఏకంగా పవర్‌ స్టార్‌ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా వకీల్ సాబ్ సినిమాలో తనలోని నటిని బయటపెట్టింది. అయితే పవర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ రావడంతో ఈ భామ దశ తిరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు ఏం రాలేదు. అయితే తాజగా ఈ భామ ఓ హార్రర్ మూవీతో మనముందుకు రాబోతోంది.

చాలా రోజుల తర్వాత మళ్లీ అనన్య.. లీడ్‌ రోల్‌లో చేస్తున్న మూవీ తంత్ర. హారర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకుడు. అనన్య బర్త్‌డే సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. మూడు డిఫరెంట్‌ కలర్స్‌లో ఉన్న చేతుల జోడీ అనన్య ముఖాన్ని కప్పేస్తున్నట్లు పోస్టర్‌ను అద్భుతంగా డిజైన్‌ చేశారు. పోస్టర్‌తోనే సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్‌ అయిందని నెటిజన్లు అంటున్నారు. ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు భరణి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news