అయ్యో.. అన‌సూయ‌.. ఇలా జ‌రిగిందేంటి..??

-

అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే.. టెలివిజన్‌లో కనిపించే యాంకర్లలో మోస్ట్ క్రేజీ బ్యూటీ ఎవరు అంటే అనసూయ అని టక్కున చెప్తారు ఎవరైనా. అంతగా ఆమె జనంలోకి వెళ్లిపోయారు. అందం, అభినయం, ఆకర్షణ కలిగిన యాంకర్ అనసూయ. పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగానూ రాణిస్తున్నారు అను. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు ఈమె. మ‌రియు అనేక సినిమాల్లో న‌టించి మెప్పించింది.

అయితే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అంధదూన్’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు నితిన్‌. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ నటిస్తున్నారని తెగ వార్త‌లు వ‌చ్చాయి. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. హిందీ సినిమా అంధాదున్ లో టబు చాలా కీలకమైన పాత్రను పోషించింది. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టడమే గాక సినిమా విజయంలో కీలకం అయింది. ఇక తెలుగులో టబు పాత్ర అనసూయ పోషిస్తుంద‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.

కానీ, మూవీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అసలు ఈ రీమేక్‌ కోసం అనసూయను సంప్రదించలేదట. హిందీలో నటించిన టబునే ఇందులో కూడా నటింపజేయాలని దర్శకుడు భావించారట. ఈ క్రమంలో ఆమెతో సంప్రదింపులు జరపడం.. తన పాత్రలో మరోసారి నటించేందుకు టబు గ్రీన్ సిగ్నెల్ అవ్వ‌డం అన్నీ జ‌రిగిపోయాయ‌ట‌. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ మూవీ కోసం అనసూయ పేరును కూడా అనుకోలేదని తెలుస్తోంది. టబు పాత్ర కోసం ముందు నుంచే ఆమెనే అనుకున్నారని, మిగిలిన ఎవరినీ ఆ పాత్రలో ఊహించుకోలేదని సమాచారం. దీంతో అన‌సూయ అభిమానులు ఇలా జ‌రిగిందేంటి అని అనుకుంటున్నార‌ట‌.

 

Read more RELATED
Recommended to you

Latest news