మ‌రోసారి అత్త పాత్ర‌లో క‌నిపించ‌నున్న యాంక‌ర్ అన‌సూయ‌!

-

జ‌బర్ధ‌స్త్ కామోడీ షో తో తెలుగు రాష్ట్రాలలో అభిమానులను సొంతం చేసుకున్న అన‌సూయ‌.. సినిమాల‌లోనూ దూసుకెళ్తుతుంది. కాగ మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్త క్యారెక్ట‌ర్ తో అన‌సూయ క్రేజ్ ఒకేసారి పెరిగిపోయింది. అలాగే ఇటీవ‌ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్ర‌కు కూడా ఈ బుల్లితెర యాంక‌ర్ కు మంచి మార్కులే వ‌చ్చాయి. కాగ అన‌సూయ ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ ఖిలాడి సినిమాలో న‌టిస్తుంది.

కాగ ఈ సినిమాలో అన‌సూయ రెండు విభిన్న పాత్ర‌ల‌లో నటిస్తుంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి వార్తలు వ‌స్తున్నాయి. కాగ ఈ సినిమాలో అన‌సూయ ఒక పాత్ర‌లో హీరో ర‌వితేజా కు అత్త పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం. కాగ ఇప్ప‌టికే రంగ‌స్థలం సినిమాలో అత్త క్యారెక్ట‌ర్ చేసిన అన‌సూయ కుర్ర‌కారు మ‌తి పొగుట్టింది. ఈ సినిమాలో అన‌సూయ అత్త క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇదీల ఉండ‌గా మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తీలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కాగ వీరిలో ఒక‌రికి అనసూయ త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం. అలాగే మ‌రొక మోడ్రాన్ గ్లామ‌ర‌స్ పాత్ర‌లో అన‌సూయ క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది. కాగ ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న థీయేట‌ర్ల‌లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news