మగబిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య..!

-

ఉగాది రోజున యాంకర్ లాస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం పురుటి నొప్పులతో హాస్పిటల్ లో జాయిన్ అయిన లాస్య 14 గంటల పాటు సుధీర్ఘమైన నొప్పులను బరించి మగబిడ్డకు జన్మనిచ్చింది. యాంకర్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న లాస్య తన స్నేహితుడు మంజునాథ్ ను పెళ్లాడింది. 14 గంటల ప్రయత్నంతో నువ్వు బయటకు వచ్చావు. మమ్మల్ని కలుసుకున్నావు. నిన్ను చూసిన ఆనందానికి నేను పడిన ఆ నొప్పుల బాధ కూడా మాయమైంది. నీ మొదటి ఊపిరి, నీ మొదటి ఏడుపు.. ఎంతో సంతోషాన్ని నింపింది. మా ప్రార్థనలకు సమాధానం నువ్వు అంటూ లాస్య తన ఆనందంతో మెసేజ్ పెట్టింది.

పెళ్లి తర్వాత యాంకరింగ్ కు దూరంగా ఉన్న లాస్య డెలివరీ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్లీ బుల్లితెరకు రానుందని తెలుస్తుంది. పండుగ రోజు లాస్య చెప్పిన ఈ గుడ్ న్యూస్ కు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం తన ఫేస్ బుక్ లో ఫోటో షేర్ చేసిన లాస్య బాబు ఫోటోకి లైకులు, షేర్లు అదరగొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news