మేష సంక్రమణం వల్ల పగలు – ధరలు పెరుగుతాయి..!

బ్రాహ్మణ హస్తమందు ఆఢకము ఉండుట వల్ల అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. గోప హస్త-మందు ఆఢకము ఉండుట వలన క్షేమారోగ్యములు, సిరిసంపదలు, సుభిక్షము ఉండును. బాల్య గోప హస్తమందు ఉండుట వలన వర్షాభావ పరిస్థితులు కొన్ని ప్రాంతముల యందు ఉంటాయి.

మేష సంక్రమణం: శ్రీ వికారి నామ సంవత్సర చెత్ర శుక్ల నవమి ఆదివారం తేది 14-04-2019 రోజున పగలు 02-08 ని.లకు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమున సూర్యుడు మేషరాశి యందు ప్రవేశము.

ఫలితము : దశమి తిథి – శుభప్రదం, ఆదివారం – భయాందోళనలు, పగలు – ధరలు పెరుగుతాయి, అక్కడక్కడా ప్రజల మధ్య కలహాలు చోటు చేసుకుంటాయి. ఆరుద్రాది చతుష్టయం – ప్రజలకు అనుకూలమైన పనులు చేపడతారు, పురో-భివృద్ధి ఉంటుంది, ఆశ్లేష నక్షత్రం – అక్కడక్కడా హింసాత్మక సంఘటనలు, శూల నామ యోగం – సామాన్య వర్షం, తైతుల కరణం – శుభప్రదం, కర్కాటక లగ్నం – శుభప్రదం. సాముదాయక ఫలితం : వ్యాపారంలో ఒడుదొడుకులు, దేశాధినేతల మధ్యన సమన్వయ లోపము తద్వారా ఇరుగు పొరుగు దేశ-ములతో సంబంధ బాంధవ్యాలు మామూలుగా ఉంటాయి.

ఈ సంవత్పరమందు ఒక తూము వర్షము. మంచి వర్షములు ఉంటాయి. ఆఢకము దేవమానముతో అరువది యోజనముల వెడల్పు, నూరు యోజన-ముల ఎత్తు కలిగి యుండును. సముద్రమందు పది భాగములును, పర్వతములందు తొమ్మిది భాగము-లును, భూమి యందు ఒక్క భాగము వర్షించును. కనుక ఈ సంవత్సరము 1 తూము వర్షము, 2 తూముల వాయువు. ఈ సంవత్సరము ప్రారంభం నుండి భాద్రపద శుక్ల విదియ ఆదివారం 01-09-2019 వరకు వృద్ధ బ్రాహ్మణ హస్తమందు, తదాది ఆశ్వీయుజ శుక్ల షష్టి శుక్రవారం 04-10-2019 వరకు యవ్వన బ్రాహ్మణ హస్త-మందు, తదాది మార్గశిర కృష్ణ త్రయోదశీ మంగళ-వారం 24-12-2019 వరకు తిరిగి వృద్ధ బ్రాహ్మణ హస్తమందు తదాది సంవత్సరమంతయూ బాల్య గోప హస్తమందు ఆఢకము ఉంటుంది.

బ్రాహ్మణ హస్తమందు ఆఢకము ఉండుట వల్ల అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. గోప హస్త-మందు ఆఢకము ఉండుట వలన క్షేమారోగ్యములు, సిరిసంపదలు, సుభిక్షము ఉండును. బాల్య గోప హస్తమందు ఉండుట వలన వర్షాభావ పరిస్థితులు కొన్ని ప్రాంతముల యందు ఉంటాయి. యవ్వన గోప హస్తమందు ఆఢకము ఉండుట వలన వర్షాధికములు, సువృష్టి మొదలైన ఫలితాలు ఉంటాయి. ఈ సంవ-త్సరము వర్షము-15, ధాన్యము-07, మొత్తం మీద ఈ సంవత్సరమున 10 వీసముల కధికముగా పంటలు ఫలించును. సువృష్టి, క్షేమారోగ్యములు ఉండి, ప్రజలు సంతోష జీవితాన్ని గడపగలరు.