సినిమాలలో నటించే హీరోలకు సైతం ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. బుల్లితెరపై నటించే కొంతమంది యాంకర్స్ కి కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు.. అలా ఒకప్పుడు ఆట షో తో బుల్లితెరపై పాపులర్ అయిన యాంకర్ ఓంకార్ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ షోలో అన్నయ్య అనే పదంతో మంచి పాపులారిటీ సంపాదించారు ఓంకార్ . అప్పట్లో ఓంకార్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోలతో సమానంగా ఆయన బుల్లితెర పై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఒకవైపు కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా రాణిస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు.. తాజాగా ఓంకార్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే ఓంకార్ కుటుంబ విషయాలు చాలా తక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటికే చాలామందికి ఓంకార్ కు వివాహం అయ్యిందా లేదా అనే విషయంపై సందేహం ఉండనే ఉంటుంది.. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఓంకార్ ఒక ప్రముఖ సింగర్ ని ప్రేమించాడట..
అయితే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని , కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ సింగర్ వేరే అబ్బాయి ప్రేమలో ఉండడంతో ఈ ప్రపోజల్ ను అంగీకరించలేదని వార్తలు సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్నాయి.. అయితే గతంలో ఆ సింగర్ ఓంకార్ హోస్ట్ గా చేసినటువంటి షోకి కూడా వచ్చిందట.. అప్పుడే తన మనసులో మాట ఓపెన్ గా షోలో చెప్పి ప్రపోజ్ చేసినా.. ఆ కొద్ది రోజులకే ఆ సింగర్ వేరే అతడిని వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.