కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణ త్యాగం చేసి స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాం -రేవంత్ రెడ్డి

-

లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణ త్యాగం చేసి స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో పంద్రాగస్టు వేడుకలు జరుగగా.. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగరేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… దేశానికి ఆత్మలాంటిది కాంగ్రెస్ అని… దేశ సమగ్రత కాపాడిన పార్టీ కాంగ్రెస్ అంటూ కామెంట్స్‌ చేశారు.

విభజించి పాలించు అనే బ్రిటిష్ విధానాలు.. బీజేపీ అమలు చేస్తోందన్నారు. బీజేపీ అంటే..బ్రిటిష్ జనతా పార్టీ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ స్ఫూర్తి తో జనం దగ్గరికి వెళ్లాలని పిలుపునిచ్చారు. మోడీ దేశం కి 100 లక్షల కోట్ల అప్పులు చేశారని ఫైర్ అయ్యారు. దివాళా నరేంద్ర మోడీ.. దేశాన్ని దివాళా తీశారని ఆగ్రహించారు. జీడీపీ పెంచుతా అన్నది బీజేపీ..కానీ.. గ్యాస్..డీజిల్..పెట్రోల్ ధరలు పెంచిందని మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news