ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్ప్లై చేసుకోవాలంటే కొంత ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అది కూడా రిజర్వేషన్లు బట్టి ఉంటుంది. అయితే రాజకీయాల్లో ఎమ్మెల్యే సీటుకు దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు కట్టాలనే ప్రతిపాదన ఎక్కడా లేదు. కాకపోతే అనధికారికంగా పార్టీలకు ఎమ్మెల్యే అభ్యర్ధులు ఫండింగ్ ఇస్తారు..అలాగే ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో చెప్పాల్సిన పని లేదు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్తితులకు భిన్నంగా వెళుతుంది. ఆ పార్టీలో సీట్ల కోసం పోటీపడే నేతల సంఖ్య భారీగానే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీటు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఫీజులు కట్టాలని రూల్ పెట్టారు. ఎమ్మెల్యే టికెట్ కోరే వ్యక్తి ఓసీ అయితే 10 వేలు, బీసీలు 5వేలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు 2500 రూపాయలు రుసుము చెల్లించి అప్లికేషన్ వేసుకోవాలని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రూల్ పెట్టినట్లు తెలిసింది.
అయితే ఈ ఫీజులు ఫైనల్ కాదని తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ తుది ఫీజులను డిసైడ్ చేస్తుందట. దీంతో ఎమ్మెల్యే సీటు కోసం ఫీజులు ఎంత ఉంటాయో చెప్పాలి. ఇలా ఫీజులు పెట్టడం వల్ల పోటీ చేసే అభ్యర్ధులు ఏమి తగ్గరు. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే వారు కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. అలాంటప్పుడు ఈ ఫీజులు పెద్ద లెక్క కాదు.
పైగా డబ్బులు కట్టడం వల్ల సీటు రాకపోతే ఇంకా ఎక్కువ రభస చేసే అవకాశం ఉంది. అదే సమయంలో సీటు రాకపోతే ఫీజు కట్టిన డబ్బులు వెనక్కి ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి ఎమ్మెల్యే సీటుకు ఫీజులు కట్టడం అనేది కొత్తగా ఉంది.