యాంకర్ ప్రదీప్ హీరో అవుతున్నాడు..!

టివి పెడితే ఏదో ఒక షోలో తన యాంకరింగ్ తో అలరించే ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. కొన్నాళ్లుగా ప్రదీప్ హీరోగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ గురించి కొన్ని డీటైల్స్ బయటకు వచ్చాయి. 1945 లో జరిగే కథతో ప్రదీప్ సినిమా ఉంటుందట. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుందట.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మున్నా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. కెరియర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ప్రదీప్ ఇప్పుడు ఏకంగా హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. స్మాల్ స్క్రీన్ పై అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా ప్రేక్షకుల మెప్పు పొందాలని చూస్తున్నాడు. మరి ప్రదీప్ హీరోగా చేస్తున్న ఈ తొలి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.