ఒకే ఒక్కడు.. ఒక్క ఓటు కోసం అడవిలో పోలింగ్ స్టేషన్..!

-

ఒక్క ఓటుతో ఏం జరుగుతుందిలే. రాజ్యాలు ఏమన్నా మారిపోతాయా? అని అనకండి. ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్లు కోకొల్లలు. ప్రభుత్వాలే మారిపోతాయి ఒక్క ఓటు వల్ల. అందుకే.. ఓటు ప్రాధాన్యతను గుర్తించిన ఈసీ.. ఒక్క ఓటు ఉన్నా.. రెండు ఓట్లు ఉన్నా.. అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

polling station in gujarat for only one vote

గుజరాత్‌లోని గిర్ అడవి తెలుసు కదా మీకు. ఆసియా సింహాలు అక్కడే ఉంటాయి. అడవిలో 35 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఒకే ఒక్క ఓటు కోసం. అతడి కోసం ఐదుగురు ఎన్నికల సిబ్బంది, ఇద్దరు ఫారెస్ట్ గార్డులు అడవిలోకి వెళ్లనున్నారు. ఇంకోమాటలో చెప్పాలంటే అది చాలా ఖరీదైన ఓటు. ఆ ఓటు వేసే వ్యక్తి ఎవరో తెలుసా? మహంత్ భరత్‌దాస్ అనే వ్యక్తి. గిర్ అడవి మధ్యలో బనేజ్ తీర్థం అనే శివుడి గుడి ఉందట. ఆ గుడిలోని పూజారే ఈ భరత్‌దాస్. ఆయన ఆ గుడిలోనే నివాసం ఉంటాడు. అది జునాగఢ్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

నిజానికి భరత్‌దాస్ ఓటేయాలంటే 35 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. దీంతో ఎన్నికల సంఘం గుడిలోనే ఆయన కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సాధారణంగా పోలింగ్ కేంద్రాల్లో ఉండే ఏర్పాట్లన్నీ అక్కడ కూడా ఉంటాయి. ఆయన ఓటు వేయగానే మళ్లీ అన్నీ సర్దుకొని పోలింగ్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆయన కోసం ఇప్పుడే కొత్తగా ఎన్నికల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారనుకునేరు.. 2004, 2009, 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో.. 2007, 2012, 2017 లో గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోసం గుడిలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది ఓటు విలువ అంటే.

Read more RELATED
Recommended to you

Latest news