ప్ర‌దీప్ ప్లేస్ లోకి యాంక‌ర్ ర‌వి.. మ‌రి ప్ర‌దీప్ లా లీడ్ చేస్తాడా

క‌రోనా కొంద‌రికి చెడు చస్తే మ‌రి కొంద‌రికి మంచి చేస్తుంద‌ని చెప్పాలి. ఎందుకంటే సినీ ఇండ‌స్ట్రీలో కొంద‌రికి క‌రోనా వ‌స్తే వారి ప్లేస్ లో వేరొక‌రిని తీసుకుంటున్నారు. ఈ ర‌కంగా క‌రోనా వ‌చ్చిన వారికి చెడు జ‌రిగితే వారి ప్లేస్ వ‌స్తున్న వారికి అవ‌కాశం వ‌స్తోంది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే దీని ప్ర‌భావానికి సినీ ఇండ‌స్ట్రీ అత‌లాకుత‌లం అవుతోంది.


దీని దెబ్బ‌కు కొన్ని సినిమాలు వాయిదా ప‌డ్డాయి.మ‌రి కొన్ని షూటింగ్ వాయిదా వేశాయి. ఇక ఇదిలా ఉంటే బుల్లితెరలో కూడా కొంద‌రు కొవిడ్ బారిన‌ప‌డుతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ బ్యూటీ వర్షకు పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతోంది. ఇక యాంకర్ ప్రదీప్ కు కూడా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అత‌ను ఐసోలేష‌న్ లో ఉండి చికిత్స పొందుతున్నాడు.

అయితే మ‌నోడు యాంక‌ర్ గా చేస్తున్న ఈటీవీ ఢీ, జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షోలలో మ‌నోడు లేక‌పోతే ఎలా అనే స‌మ‌స్య వ‌చ్చింది. దీంతో అత‌ని ప్లేస్ లో యాంక‌ర్ ర‌విని టెంప‌ర‌రీగా తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ర‌వికి ఇందులో అనుభవం కూడా ఉంది. దీనికి సంబంధించి ర‌వి యాంకరింగ్ చేస్తున్నట్లు తాజాగా విడుదలైన ఈ ప్రోగ్రాం ఎపిసోడ్ ప్రోమో స్ప‌ష్టం చేసింది.