యాంకర్ శ్యామల కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల హాజరు అయ్యింది. బెట్టింగ్ యాప్స్ కేసులో టీవీ, సినీ సెలబ్రిటీలను తెలంగాణ పోలీసులు వరుసగా విచారిస్తున్నారు. ఈ కేసులో 11 మందిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు.
తాజాగా పంజాగుట్ట పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల హాజరయ్యారు. అయితే, బెట్టింగ్ యాప్స్ గురించి శ్యామల ఏం చెప్పారనేది తెలియరాలేదు. ఇటు, ఇప్పటికే విచారణకు హాజరైన విష్ణుప్రియ, రీతూ చౌదరిని ఈ నెల 25న మరోసారి విచారించనున్నారు.