హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఘటన జరగ్గా.. వినియోగదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం దర్యాప్తు చేపట్టారు.
అమీర్‌పేట్‌లోని బేకర్స్‌లో పేలిన సిలిండర్
రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఘటన
కేఫ్‌లో పని చేసే ఐదుగురికి తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు
కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఘటనాస్థలికి చేరుకుని పరిశీలన… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు