మ‌రో మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు ప్లాన్ వేసిన అనిల్ రావిపూడి..

యాక్ష‌న్ సీన్ అయినా.. సెంటిమెంట్ సీన్ అయినా.. ఎమోష‌న‌ల్ సీన్ అయినా.. కామెడీ సీన్ అయినా.. ఇట్టే తీసేసి సూప‌ర్ హిట్ చేస్తాడు ఆ డైరెక్ట‌ర్‌. ఈ త‌రం యంగ్ డైరెక్ట‌ర్ల‌లో చాలామంది అన్ని సీన్ ల‌లో స‌క్సెస్ కావ‌ట్లేదు. కానీ ఈ డైరెక్ట‌ర్ మాత్రం అన్ని కోణాల్లో సీన్ లు పండిస్తూ స‌క్సెస్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయాడు. అతి త‌క్కువ టైమ్ లోనే స్టార్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇంత‌కీ ఆయ‌నెవ‌రో అర్థ‌మ‌యిందా.. ఆయ‌నేనండి డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.

ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ‌, వెంక‌టేశ్ తో మ‌ల్టీ స్టార‌ర్ సినిమా తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఎఫ్‌3 తీస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు ఈ క్రేజీ డైరెక్ట‌ర్‌. త్వ‌ర‌లోనే మ‌రో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, మాస్ మ‌హారాజ ర‌వితేజ‌తో క‌లిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడంట‌.
ఇప్ప‌టికే ర‌వితేజ‌తో రాజా ది గ్రేట్ సినిమా తీశాడు. ఈ ప‌రిచ‌య‌మే మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు ర‌వితేజ‌ను ఒప్పించిందంట‌. ఇక రామ్ కు కూడా క‌థ వినిపించాడ‌ని స‌మాచారం. వీరిద్ద‌రూ ఒప్పుకోవ‌డంతో త్వ‌ర‌లోనే సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీగా ఉన్నారు. వీరి సినిమాలు పూర్తియిన వెంట‌నే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. చూడాలి మ‌రి ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ఎలా ఉంటుందో.