స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీలా.. దశ తిరిగినట్టేనా..?

-

శ్రీ లీలా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీలా.. ఇక ఈ సినిమా పెద్దగా కలెక్షన్ల అయితే రాబట్ట లేదని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఇక తాజాగా స్టార్ హీరో సినిమాలో కూడా చాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటో ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకుందాం.

అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న F3 సినిమా మే 27వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల కాకముందే బాలకృష్ణ తో కలిసి మరో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నారు. అంతే కాదు ఈ సినిమాలో చాలా ప్రయోగాత్మకంగా బాలకృష్ణని చూపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనిల్ రావిపూడి. 50 సంవత్సరాల వయస్సు ఉన్న వృద్ధుడి గెటప్లో బాలక్రిష్ణ మనకు కనిపించబోతున్నాడు. ముఖ్యంగా తండ్రి – కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులకు చూపించే విధంగా ఈ కథ ఉండబోతోందని.. ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త కథతో మీ ముందుకు రాబోతున్నారు అని అనిల్ రావిపూడి మీడియాతో వెల్లడించారు.

ఇక ఈ క్రమంలోనే బాలకృష్ణకు కూతురి పాత్రలో శ్రీ లీలా ను తీసుకోబోతున్నట్లు అనిల్ రావిపూడి వెల్లడించారు. అంతేకాదు ఆమెను ఫైనల్ చేసినట్లు.. ఇక బాలకృష్ణ తండ్రిగా.. శ్రీ లీలా కూతురిగా ఎలా నటించబోతున్నారు.. వీరిద్దరి మధ్య అనురాగం ఎలా ఉండబోతోంది అనే విషయాలను చాలా చక్కగా తెరకెక్కించడానికి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు అనిల్ రావిపూడి స్పష్టం చేశాడు. మొత్తానికి ఈ సినిమా చాలా ప్రయోగాత్మకంగా ఉండబోతోంది అని ఇక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది అని అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news