మునగ ఆకు పొడిని ఈ విధంగా వాడుకుంటే..ఎన్ని లాభాలో..అధ్యయనంలో తేలిన నిజాలు ఇవే..!

-

మునగాకు..ఆరోగ్యానికి, కంటిచూపుకి, కాల్షియంను బాగా అదించటానికి మంచిదని చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమంది.. వారానికి ఒకసారి అయినా.. వంటల్లో వాడుకుంటూ ఉంటారు. ఊర్లలో అయితే..ములగచెట్లకు కొదవ ఉండదు..మునగఆకుకు కరువు ఉండదు..కానీ సిటీల్లో ములక్కాయలే…ఒక్కటి పదిరూపాయల చొప్పున కూడా కొనాల్సి వస్తుంది..ఇక ఆకు పరిస్థితి ఎట్లా..అందుకే..మార్కెట్ లో మునగ ఆకును పొడిరూపంలో అమ్ముతున్నారు. సైంటిస్టులు కూడా మునగ ఆకు పౌడర్ లో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని..పరిశోధనలు చేసి ఇచ్చారు. ఈరోజు మునగఆకు వల్ల ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా లాభం చేకూరుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.
రోజుకు 14-15 గ్రాముల మునగఆకు పొడిని వాడినప్పుడు..మన రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ 30శాతం తగ్గుతుంది. బ్లడ్ లో ట్రైగ్లిజరేట్స్ 30శాతం తగ్గుతున్నాయి. హార్ట్ బ్లాక్స్ రావడానికి ఈ రెండే ప్రధాన కారణాలు.
గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ ఆట్రీస్ అంటారు. వీటిల్లో కొలెస్ట్రాల్ పేరుకుని మూసేయటం వల్లే హార్ట్ ఎటాక్స్ వచ్చి ఎక్కువ మంది చనిపోతుంటారు. ఈ కరోనరి ఆట్రిస్ బ్లాకేజెస్ రాకుండా రక్షించడానికి మునగఆకు పొడి ఆద్భుతంగా పనికొస్తుందని అధ్యయనంలో తేలింది. 86శాతం పూడికలు రాకుండా నివారిస్తుందని 2008లో మహిడాల్ యూనివర్శిటీ థైలాండ్( Mahidol University- Thailand) వారు నిరూపించారు.
రోజుకు 7 గ్రాముల మునగఆకు పొడి వాడితే మన శరీరంలో యాంటిఆక్సిడెంట్ లెవల్ 40 శాతం పెరుగుతుందని 2014వ సంవత్సరంలో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీ( Punjab Agricultural University) వారు పరిశోధన చేసి నిరూపించారు. మన శరీరం జబ్బుల భారిన పడకుండా రక్షించే బీటాకెరోటిన్ అనేది మునగ ఆకులో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇంకా ఈ మునగఆకు పొడిలో ఉండే కొర్సటిన్( Quercetin), క్లొరోజనిక్ యాసిడ్ ( Chlorogenic acid) అనేవి యాంటిఆక్సిడెంట్ లా బాగా ఉపయోగపడుతున్నాయట.
రోజుకు మునగఆకు పొడిని 7-8 గ్రాములు వాడినప్పుడు బ్లడ్ ఘుగర్ లెవల్స్ 13- 14 శాతం తగ్గుతున్నాయని సైంటిఫిక్ గా నిరూపించారు.

100 గ్రాములు మునగఆకు పొడిలో ఉండే పోషక విలువలు:

కార్బోహైడ్రేట్స్ 5.6 గ్రాములు
ప్రొటీన్ 6.4 గ్రాములు
ఫ్యాట్ 1.6 గ్రాములు
ఫైబర్ 8.2 గ్రాములు
శక్తి 67 కాలరీలు
బీటాకెరోటిన్ 17542 మైక్రో గ్రాములు..మనకు ఒకరోజుకు కావాల్సిన బీటాకెరోటిన్ కేవలం 2400మైక్రోగ్రాములు మాత్రమే. కానీ వంద గ్రాముల్లోనే బోలెడు అందుతుంది. కొంచెంపొడి వాడినా చాలు.
ఐరెన్ 4.5 మిల్లీ గ్రాములు
సోడియం 9.3 మిల్లీగ్రాములు
కాల్షియం 314 మిల్లీగ్రాములు
విటమిన్ D2 14.3 మైక్రోగ్రాములు
విటమిన్ C 108 మిల్లీగ్రాములు
ఫోలిక్ యాసిడ్ 42 మైక్రోగ్రాములు..
ఇవి మునగాకులో ఉండే స్థూల, సూక్ష్మపోషకాలు.

మునగఆకు పొడిని ఎలా వాడుకోవచ్చంటే..

మునగఆకు పొడిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని తేనె, నిమ్మరసం కలుపుకుని తాగేయొచ్చు. లేదా నీళ్లలో వేసి మరిగించి తేనె, నిమ్మరసం కలిపి టీ తాగినట్లు తాగేయొచ్చు. మునగఆకు పొడిని వంటల్లో కూడా కలుపుకోవచ్చు. వెజిటబుల్ జ్యూస్ లో కూడా మునగఆకు పొడిని ఒక స్పూన్ కలుపుకోవచ్చు. పుల్కాల పిండి కలిపేటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పొడిని వేసి కలపండి. ఇలా ఏదో ఒక రకంగా రోజు ఈ పొడిని 7-8 గ్రాములు వాడుకోవటం ఉత్తమం. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఘుగర్ పేషెంట్స్ తమ డైట్ లో మునగఆకు పొడిని భాగం చేసుకోవాలని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news