వినూత్న కథతో తెలుగులో వస్తున్న మరో సినిమా.. శుక్రవారం ఫస్ట్ లుక్

-

ఈ సినిమా మొదటి సగం మొత్తం కామెడీయేనట. రెండో భాగం ఎమోషన్స్ ఉంటాయట. మొత్తానికి ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త సినిమా అవుతుందని సినిమా యూనిట్ చెబుతోంది.

అవును.. తెలుగు సినిమా పంథా కూడా మారింది. ఎప్పుడూ ఆ మూస ధోరణేనా. సినిమా అంటే మూడు ఫైట్లు, ఆరు పాటలు, కొంచెం సెంటిమెంట్.. మరికొంచెం రొమాన్స్.. ఇంకొంచెం కామెడీ.. క్లయిమాక్స్‌లో హీరోహీరోయిన్స్ కలుసుకోవడం.. ఇదేనా? తెలుగు సినిమా పరిధి ఇంతేనా? అంటే కాదనే అంటున్నాయి కొన్ని సినిమాలు. అవును.. చిన్న సినిమాలుగా విడుదలయి.. సంచలనాలు సృష్టించిన ఎన్నో సినిమాలను మనం చూశాం. ఆ సినిమాల డైరెక్టర్లు కూడా అంతగా అనుభవం ఉన్నవాళ్లు కాదు. కానీ.. వాళ్లు తమ మొదటి సినిమానే ఇరగదీశారు.

తాజాగా అటువంటిదే మరో సినిమా వస్తోంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సాహిత్ మోత్కూరీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. నిజాయితీగా ప్రాణం పెట్టి ఆ సినిమాను ఈ కొత్త దర్శకుడు తీశాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ కూడా కాస్త వింతగా, కొత్తగా ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 2.10కు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది.

ఈ సినిమా మొదటి సగం మొత్తం కామెడీయేనట. రెండో భాగం ఎమోషన్స్ ఉంటాయట. మొత్తానికి ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త సినిమా అవుతుందని సినిమా యూనిట్ చెబుతోంది. చూద్దాం..ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడికి తీసుకుపోతుందో. ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది మాత్రం ఇంకా తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Latest news