సైరాలో మెగా హీరో.. ఛాన్స్ ఎవరికి..!

-

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథతో వస్తున్న ఈ సినిమాలో ఓ మెగా హీరో నటిస్తాడని టాక్. చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర అయినా చేసేందుకు తాము సిద్ధమని మెగా హీరోలంతా చెబుతూనే ఉన్నారు.

అయితే సైరాలో చిన్న కెమియో రోల్ ఉందట. ఆ ఛాన్స్ ఎవరికి వస్తుంది కచ్చితంగా రాం చరణ్ అయ్యి ఉండడు.. చిరు, చరణ్ చాలా సార్లు కలిసి కనిపించారు కాబట్టి సైరాకి స్పెషల్ ఎట్రాక్షన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం సైరాలో గోన గన్నారెడ్డి అదేనండి అల్లు అర్జున్ నటించే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.

చిరు అంటే బన్నికి ఎంత అభిమానం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సైరాలో ఛాన్స్ వస్తే తాను తప్పకుండా చేస్తా అంటున్నాడు బన్ని. ఎలాగు రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా అదరగొట్టాడు కాబట్టి సైరాలో బన్ని కచ్చితంగా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version