తెలుగులో మరో ఓటీటీ ఛానెల్.. ఈటీవీ నుండి..

-

ఓటీటీ బిజినెస్ ఎలా ఉంటుందన్న విషయం కరోనా కారణంగా ప్రతీ ఒక్కరికీ తెలిసొచ్చింది. థియేటర్లు మూతబడి ఉన్న కారణంగా వినోదమంతా ఓటీటీలోనే దొరుకుతుంది. లాక్డౌన్ పుణ్యమా అని ఓటీటీ వేదికలకి సబ్ స్క్రయిబర్స్ విపరీతంగా పెరిగారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ఓటీటీ వేదికలు పుట్టుకొస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి వేదికలు ఓటీటిలో రాజ్యమేలుతుండగా, వాటికి పోటీ అన్నట్టుగా ఒక్కొక్కటిగా తెరమీదకొస్తున్నాయి.

ఇప్పటికే తెలుగులో ఆహా మొదలైంది. తాజాగా ఈటీవి నుండి ఓటీటీ వేదిక రానుందట. ఈ మేరకు రామోజీరావు గారు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈటీవీ దగ్గర ఉన్న సినిమాల కంటెంట్ మరే టీవీ ఛానెల్ దగ్గర లేదేమో. ఉషాకిరణ మూవీస్ ద్వారా నిర్మితమైన సినిమాలన్నీ ఈ ఓటీటీలో ఉండనున్నాయట. అదీగాక ఈటీవీ కొనుక్కున సినిమాలు సైతం ఇందులో ప్రదర్శితం అవుతాయి. ఇవన్నీ కలుపుకుంటే ఏకంగా వంద సినిమాలకి పైగానే ఈటీవీ దగ్గర కంటెంట్ ఉంది.

అందువల్ల ఓటీటీ ఓపెన్ చేసి తమ సినిమాలతో పాటు కొత్త కొత్త సినిమాలని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు అధికారిక సమాచారం ఇంకా రానప్పటికీ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news